| విడుదలకు సిద్దమైన "చలో వన్ టూ త్రీ" |
|
| Friday, 12 February 2010 12:44 |
|
S R Creations పతాకం పై సాయి కిరణ్ , శివాజీ రాజ , కీర్తి , హీరో హీరోయిన్లు గా వెంకటరాం పల్లా దర్శకత్వం లో అల్లాడి శ్రీనివాసరావు నిర్మించిన కామెడి సస్పెన్స్ చిత్రం చలో... వన్..టూ..త్రీ. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రం నెలాఖరికి విడుదలకి సిద్దమయింది. ఈ సందర్భం గా నిర్మాత మాట్లాడుతూ ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ.ఈ చిత్రం లో 5 పాటలు వుంటాయి . సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఈ నెలాఖరుకి విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా, అని అన్నారు . బేబీ శ్రీహిత సమర్పిస్తున్న ఈ చిత్రం లో ఇంకా బాబు మోహన్ , జయ రమేష్ , అల్లరి సుభాషిని , రామారావు , రామి రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం.. రాజ్ కిరణ్ , డాన్స్.. సుధాకర్, కేమెర .. శూలం ప్రసాద్ , మాటలు.. ఉపేంద్ర, ఫైట్స్.. అవినాష్ , Excutive producer : AV. రాఘవ రెడ్డి , సహనిర్మాతలు .. బిచినేపల్లి వెంకట నరసింహారావు , తుమ్మా విజయ్ భరత్ రెడ్డి .
|








