|
'కోతిమూక' చిత్రం షూటింగ్ ప్రారంభం |
|
|
Tuesday, 23 February 2010 06:10 |
|
కృష్ణుడు, శ్రద్ధా ఆర్య జంటగా ఏవీయస్ దర్శకత్వం వహిస్తున్న 'కోతిమూక' చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సోమవారం ప్రారంభమైంది. తులసి పూజిత ఫిలిమ్స్ పతాకంపై వెంకట్ జగదీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక్కడ జరిగిన సమావేశంలో దర్శకుడు ఏవీయస్ మాట్లాడుతూ "ఇదివరకు నేను రూపొందించిన మూడు సినిమాలు దరశకుడిగా సంతృప్తినిచ్చినా, కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అలాంటి సక్సెస్సే ధ్యేయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నా. మణిశర్మ సంగీతంలో ఇప్పటికే ఐదు పాటల్ని రికార్డు చేశాం. 'బందిపోటు' చిత్రంలో ఆరుద్ర రాసిన 'ఊహలు గుసగుసలాడే..' పాటని ఇందులో రీమిక్స్ చేశాం. ఆ పాటని ఘంటసాల కుమారుడు రత్నకుమార్ పాడారు అని తెలిపారు.
Tags: తెలుగు సినిమా | telugu cinema | కోతిమూక | తెలుగు సినిమా వార్తలు |