కె విశ్వనాథ్ రూపొందిస్తున్న చిత్రం 'సుమదురం' E-mail
Tuesday, 23 February 2010 13:31

అల్లరి నరేశ్, మంజరి జంటగా చాలా కాలం విరామంతో సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్ రూపొందిస్తున్న చిత్రం 'సుమదురం' ఈ చిత్రం షూటింగ్ గుంటూరులో జరుగుతోంది. ఈ సందర్భంగా కె. విశ్వనాథ్ మాట్లాడుతూ "తొలి షెడ్యూలులో భాగంగా హైదరాబాద్, అన్నవరంలలో చిత్రీకరణ జరిపాం.

ఇంతవరకు మూడు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు తీశాం. ఇప్పుడు తీస్తున్న ప్రార్థనా గీతం చిత్రంలో తొలిపాటగా వస్తుంది. మణిశర్మ చక్కని బాణీలనిస్తున్న ఇందులోని పాటలన్నీ మంచి సాహిత్యంతో కూడుకున్నవే. ఇదివరకు నేను రూపొందించిన 'శుభోదయం', 'సీతామహాలక్ష్మి' చిత్రాల కోవకు చెందే సరదాగా నడిచే వినోదాత్మక చిత్రమిది. మేతో సినిమా పూర్తవుతుంది. చిత్రంలో మొత్తం ఆరు పాటలుంటాయి'' అని అన్నారు.

 

 

Add comment

Security code
Refresh